జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసు విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. ఈరోజు కోడికత్తి కేసును విచారించిన న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి విచారణకు హాజరుకావాల్సిందేనని పేర్కొంది. బాధితుడిని ఇంత వరకూ ఎందుకు విచారించలేదని ప్రశ్నించింది.
కోడికత్తి శీనుకు బెయిల్ నిరాకరణ...
అయితే ఎన్ఐఏ తరుపున న్యాయవాది బాధితుడి స్టేట్‌మెంట్ ను రికార్డ్ చేశామని తెలిపారు. స్టేట్‌మెంట్ రికార్డు చేస్తే ఛార్జిషీట్ లో ఎందుకు పేర్కనలేదని ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా మిగిలిన సాక్షులను విచారించి ప్రయోజనం ఏంటని వ్యాఖ్యానించింది. ఈ నెల 31నుంచి ఈ కేసు విచారణకు షెడ్యూల్ ను న్యాయమూర్తి ప్రకటించారు. బాధితుడితో సహా మిగిలిన వారంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.