Nimmagadda : ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు

Update: 2024-05-22 07:38 GMT

మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో కోరారు. ఇలాంటి తరహా ఘటనలు మరొకటి చోటు చేసుకోకుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన కోరారు.

ఇతరులు ఎవరూ...
ఇతరులు ఎవరూ ఇలాంటి పనులు చేయడానికి సాహసించకుండా ఉండేలా చర్యలు ఉండాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఫిర్యాదుకు జత చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News