Nimmagadda : ఇలా అయితే ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?

రాష్ట్రంలో ప్రతిపక్షాలను పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు

Update: 2024-05-11 06:36 GMT

రాష్ట్రంలో ప్రతిపక్షాలను పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. రాయలసీమ, పల్నాడులో ప్రతిపక్షాల కార్యకర్తలను పోలీస్ స్టేషన్‍కు రావాలని నోటీసులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అరెస్ట్ లు కూడా చేస్తున్నారని పోలీసులు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు.

పోలీసులే భయభ్రాంతులకు...
ఇలాంటి చర్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఇలా అయితే ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. ప్పటికే సీఈసీ, డీజీపీ, ఆయా జిల్లాల ఎస్పీలకు తాము ఫిర్యాదు చేశామని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు.


Tags:    

Similar News