Nimmagadda : ఒక వ్యక్తికి ఒకే ఓటు
ఒకరికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు
ఒకరికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. రెండు ఓట్లు కలిగి ఉండటం అనైతికమని ఆయన అన్నారు. దేశంలో అనేక మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, వీటిలో వారు ఎంపిక చేసుకున్న దానిని ఉంచి, మిగిలిన చోటనుంచి ఓటును తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.
చర్యలు తీసుకోవాల్సిందే...
పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవడం కూడా నైతికం కాదన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి కోరినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. గవర్నర్ తమ అభిప్రాయం పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే ఓటును తొలగించేటప్పుడు మాత్రం ఆ వ్యక్తికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందన్న నిమ్మగడ్డ నివాసం లేనంత మాత్రాన ఓటును తొలగించ కూడదని చెప్పారు.