బాబు అరెస్ట్: టీడీపీ ఎమ్మెల్యే 'నిమ్మల'కు గుండెపోటు

పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు

Update: 2023-09-09 07:14 GMT

పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిమ్మల కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటివద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోవడంలేదంటూ వారు మండిపడ్డారు. ఎమ్మెల్యేకి ఏదైనా జరిగితే అందుకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఇవాళ తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ అధికారులు 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.


Tags:    

Similar News