తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ

శని, ఆదివారాలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లన్నీ భక్తులతో నిండిపోయాయి

Update: 2022-06-12 03:02 GMT

శని, ఆదివారాలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతుంది. క్యూలైన్ లన్నీ నిండిపోయి బయటకు బారులు తీరాయి. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. పేరుకు 48 గంటల సమయం అని చెబుతున్నా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చే సరికి రెండురోజుల పడుతుందని చెబుతున్నారు. వైకుంఠం, నారాయణగిరి క్యూ కాంపెక్లెలన్నీ నిండిపోయి మూడు కిలోమీటర్ల క్యూలు దర్శనమిస్తున్నాయి.

టీటీడీ ఏర్పాట్లు...
ఈరోజు రాత్రి వరకూ ఈ రద్దీ కొనసాగే అవకాశముంది. టీటీడీ అధికారులు శని, ఆదివారాలు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినా ఫలితం లేదు. వేసవి సెలవులు ముగియనుండటం, తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో ఈ రద్దీ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. క్యూలైన్ లో ఉన్న భక్తులకు నిరంతరం టీటీడీ సిబ్బంది అల్పాహారం, మంచినీరు, పాలు వంటివి అందిస్తున్నారు.


Tags:    

Similar News