Tirumala : భక్తులకు గుడ్ న్యూస్.. ఈరోజు తిరుమల వస్తే?
తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది. సంక్రాంతి పండగ ప్రారంభం కానుండటంతో తిరుమలలో భక్తలు సంఖ్య తక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది. సంక్రాంతి పండగ ప్రారంభం కానుండటంతో తిరుమలలో భక్తలు సంఖ్య తక్కువగా ఉంది. సంక్రాంతి పండగ రోజు ఎక్కువగా సొంతూళ్లలోనే ఎక్కువ మంది గడపటానికి ఇష్టపడతారు. అందుకే తీర్థయాత్రల వంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ కారణం చేతనే తిరుమలలోనూ భక్తుల రద్దీ తగ్గిందని చెబుతున్నారు. భక్తులు స్వల్పంగానే ఉండటంతో తిరుమలలోని క్యూ లైన్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వసతి గదులు కూడా వెంటనే దొరుకుతున్నాయి.
సులువుగా దర్శనం...
నేడు తిరుమలలో శ్రీవారి దర్శనం సులువుగా దొరుకుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండానే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో మాత్రం ఉదయం ఏడున్నర గంటల తర్వాత టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,588 మంది భక్తులు దర్శించకున్నారు. వీరిలో 16,574 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.26 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.