Tirumala : తిరుమలలో గత ఏడాది హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంటుంది. హుండీ ఆదాయం కూడా పెరిగింది;

Update: 2025-01-02 07:49 GMT

తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంటుంది. భక్తులు అధికంగా వస్తే తిరుమల వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం కూడా అంతే పెరుగుతుంది. ఎప్పటికప్పుడు తిరుమలలో హుండీని లెక్కవేస్తూ ఏరోజు కారోజు ఎంత హుండీ ఆదాయం వచ్చిందీ ప్రకటిస్తారు. రోజుకు మూడు కోట్ల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ హుండీ ఆదాయం వస్తుంది.

లడ్డూ విక్రయాలు...
అయితే గత ఏడాది తిరుమల హుండీ ఆదాయం విపరీతంగా పెరిగింది. 2024లో స్వామివారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరిలో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించు కున్నారన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీకి గత ఏడాది 1,365 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆరు కోట్లమందికి అన్న ప్రసాదం అందజేశామని, 12.14 కోట్ల లడ్డూ విక్రయాలు జరిపినట్టు పేర్కొన్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News