Vijayawada : బెజవాడలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. ఉన్నతాధికారుల సీరియస్
విజయవాడలో కలుషితనీరు తాగి ఇద్దరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు
విజయవాడలో కలుషితనీరు తాగి ఇద్దరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడటం కలకలం రేపింది. మరో ముప్ఫయి మందికి కలుషిత నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రలలో చేరారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రుల పాలయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుుగుతుంది.
పాత పైపులైన్ వేయడంతో...
మూడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లను మార్చకపోవడంతో లీకేజీ కారణంగా నీరు కలుషితమయ్యాయని విజయవాడ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. నీరు రంగుమారుతుంది. మురుగు నీరు తాగునీటిలో కలసి సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇద్దరు మృతి చెందారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో ముగ్గురు చనిపోయారు. ఇప్పటికైనా పాత పైపులైన్లను మార్చాలని స్థానికులు కోరుతున్నారు.