ఇద్దరూ కలసి.. రెండు రోజులు.. నాలుగు సభలు
ఈ నెల 16, 17 తేదీల్లో తిరిగి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో వారు ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. తణుకుతో పాటు కోనసీమ జిల్లాలోని అమలాపురంలోనూ ఇద్దరూ రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో...
అయితే ఈ నెల 16, 17 తేదీల్లో తిరిగి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయింది. 16వ తేదీన ఇరువురు నేతలు కలసి విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 17వ తేదీన పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.