Chandrababu : సూపర్ సిక్స్ ను త్వరలోనే అమలు చేస్తాం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Update: 2024-08-15 05:27 GMT

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగంతో ఏర్పడిన స్వాతంత్ర్య ఫలాలను నేడు అనుభవిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు వంద రోజుల ప్రణాళిక లక్ష్యంతో అన్ని శాఖలను సమీక్షలను చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో ఉన్నామని తెలపారు.

చైతన్యం కలిగిన...
ఇది చైతన్యం కలిగిన ప్రాంతమని, విభజనతో అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు గత ఐదేళ్లు రాజధానిగా లేకుండా కూడా పాలకులు చేశారన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను త్వరలోనే అమలు పరుస్తామని తెలిపారు. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుపరుస్తామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో ప్రధమంగా నిలిచామన్న చంద్రబాబు తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపర్చామని చెప్పారు.


Tags:    

Similar News