Andhra Pradesh : ఊరు ఊరంతా ఖాళీ.. వేరే ప్రాంతానికి తరలి...?
మాఘమాసం పౌర్ణమి సందర్భంగా తలారి చెరువు గ్రామాన్ని ఖాళీ చేసిన గ్రామస్థులు వేరే ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు.;

గ్రామాల్లో ఇప్పటికీ పెద్దలు పాటించిన సంప్రదాయాలను పాటిస్తున్నారు. గ్రామానికి చెడు జరగకూడదన్న కారణంతో ఊరు ఊరంతా ఖాళీ చేసి వేరే ప్రాంతానికి తరలి వెళ్లిపోయింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాఘమాసం పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామాన్ని ఖాళీ చేసిన గ్రామస్థులు వేరే ప్రాంతానికి పిల్లా పాపలతో తరలి వెళ్లిపోయారు.
కీడు జరగకుండా...
ఉన్న ఊరిని వదలి వేరే ప్రాంతానికి తరలి వెళ్లడంతో గ్రామం ఖాళీ అయింది. గ్రామంలో ఎప్పుడో జరిగిన హత్య కారణంగా తమకు పాపం చుట్టుకుంటుందని భావించిన గ్రామస్థులు ఈ ఆచారాన్ని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాజీవలి దర్గాలో రాత్రి నిద్రపోయి 24 గంటలు బస చేసిన అనంతరం తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. ఈ వింత ఆచారాన్ని కొన్నేళ్లుగా గ్రామస్థులు కొనసాగిస్తున్నారు.