Magunta : నేడు టీడీపీలోకి మాగుంట కుటుంబం
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబం నేడు టీడీపీలో చేరనుంది;
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబం నేడు టీడీపీలో చేరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీలో నేడు చేరనున్నారు. ఒంగోలు పార్లమెంటు టిక్కెట్ ను వైసీపీ కేటాయించకపోవడంతో ఆయన కొద్దిరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు.
మాగుంట రాఘవరరెడ్డి పోటీకి...
నేడు టీడీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. టీడీపీ తరుపున ఒంగోలు పార్లమెంటుకు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబు సమక్షంలో వారు పార్టీ కండువాను కప్పుకోనున్నారు.