వైభవంగా రామయ్య కల్యాణం
వైభవంగా ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం జరిగింది. వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
వైభవంగా ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం జరిగింది. వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భక్తులందరికి ముత్యంతో కూడిన తలంబ్రాల పంపిణీ చేశారు. ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున బుధవారం ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రమంత్రికిటీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు ,ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు.
పట్టువస్త్రాలను...
అర్చకులు మంత్రికి తలపాగా కట్టి పళ్లెం లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. మంత్రి దంపతులు వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రికి వేద పండితులు శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో...
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ,జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, శ్రీ జి. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా కాలికి అయిన గాయంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని జరిపించారు.