రోడ్డుపై బోల్తా కొట్టిన పామాయిల్ ట్యాంకర్.. ఎగబడిన జనం
అద్దంకి - నార్కేట్‌పల్లి జాతీయ రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది
అద్దంకి - నార్కేట్‌పల్లి జాతీయ రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రాజుపాలెం పెదనెమలిపురి వద్ద ట్యాంకర్ బోల్తాపడటంతో పామాయిల్ మొత్త నేలపాలయింది. అయితే స్థానికులు పామాయిల్ ను ను తీసుకునేందుకు ఎగబడ్డారు. పామాయిల్ కావడంతో ఎక్కువ మంది స్థానికులు అక్కడకు చేరుకుని రోడ్డుపైన పడిన ఆయిల్ ను తీసుకెళుతున్నారు.
ట్రాఫిక్ కు అంతరాయం...
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆయిల్ ట్యాంకర్ తిరగబడటంతో ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పామాయిల్ ట్యాంకర్ నెల్లూరు నుంచి లోడ్ తో హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.