పల్నాడు... దిశ ఇప్పటికైనా మారనుందా?
నరసరావు పేట కేంద్రంగా ఏర్పాటుకానున్న పల్నాడు జిల్లా 26 జిల్లాల్లో అత్యంత వెనకబడిన జిల్లాగా చెప్పుకోవచ్చు.
పల్నాడు ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. నరసరావు పేట కేంద్రంగా ఏర్పాటుకానున్న ఈ జిల్లా 26 జిల్లాల్లో అత్యంత వెనకబడిన జిల్లాగా చెప్పుకోవచ్చు. అన్నింటా వెనుకబాటుతనం. పైగా ఫ్యాక్షనిజం. అన్నీ కలసి ఈ ప్రాంతం ఇప్పటి వరకూ అభివృద్ధి చెందకుండా పోయింది. హత్యలు, కక్షలు, కార్పణ్యాలతో రగలిపోయే పల్నాటి ప్రాంతంలో అభివృద్ధికంటే వెనుకబాటు తనమే ఎక్కువగా కన్పిస్తుంది. ఇప్పటికే పల్లాడు ప్రాంతం అభివృద్ధిపై కొంత దృష్టిపెట్టాయి. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్త జిల్లాలు...
అటువంటి పల్నాడు ప్రాంతం ఇప్పుడు కొత్త జిల్లాగా అవతరించబోతుంది. సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకూరిపేట, వినుకొండ, మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో ఉంటున్నాయి. గుంటూరు జిల్లాను మొత్తం మూడు జిల్లాలుగా మార్చారు. గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో వేమూరు, రేపల్లె, చీరాల, బాపట్ల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలున్నాయి. కొత్తగా పల్నాడు జిల్లా ఏర్పాటయిన తర్వాతయినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం.