వాయిస్... విధేయత... మంత్రి పదవి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ గా నిలిచారు. కాంగ్రెస్ వైఎస్ విధేయుడిగా ముద్రపడ్డారు అంబటి రాంబాబు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ గా నిలిచారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి వైఎస్ విధేయుడిగా ముద్రపడ్డారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలను ప్రారంభించిన అంబటి రాంబాబు 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయనకు చివరి గెలుపు. తర్వాత 2019 ఎన్నికల్లో సత్తెన పల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు పై విజయం సాధించారు. తొలిసారి మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని భావించారు. కానీ రెండోసారి విధేయత, వాయిస్, నమ్మకం వంటి కారణాలతో అంబటి రాంబాబుకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. ఈయనకు కీలక మంత్రిత్వ శాఖ కట్టబెట్టే అవకాశముంది. సామాజిక సమీకరణాల్లో ఈయనకు మంత్రి పదవి రాకపోవచ్చని ఊహించినా జగన్ మాత్రం తన వెన్నంటి నిలిచిన అంబటికి మంత్రి పదవిని ఇచ్చారు.