Pawan Kalyan : పవన్ కు ఆస్తులెన్ని ఉన్నాయో.. అప్పులు కూడా?
ఈరోజు పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో పవన్ కల్యాణ్ తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు
ఈరోజు పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో పవన్ కల్యాణ్ తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు అని ఆయన ఎన్నికల అఫడవిట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్ల రూపాయలని చెప్పారు. ఆయన ఇచ్చిన విరాళాలు రూ.20 కోట్ల రూపాయలు న్నాయని తెలిపారు. పవన్ తనకు అప్పులు రూ.64.26 కోట్లు ఉన్నట్లు అఫడవిట్ లో పేర్కొన్నారు.
ఐదేళ్ల సంపాదన...
గత ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300లు. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించాననని తెలిపారు. పవన్ కళ్యాణ్ అప్పులు రూ.64,26,84,453 ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయి. 20 కోట్ల రూపాయల పైనే పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు.