గ్రేస్ మార్కులివ్వండి.. పవన్ డిమాండ్

టెన్త్ ఫలితాలపై పవన్ కల్యాణ్ మండి పడ్డారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి తల్లిదండ్రులే కారణమనడంపై పవన్ అభ్యంతరం చెప్పారు

Update: 2022-06-08 09:16 GMT

టెన్త్ ఫలితాలపై పవన్ కల్యాణ్ మండి పడ్డారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి తల్లిదండ్రులే కారణమంటూ మంత్రులు అనడంపై పవన్ అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఉత్తీర్ణత శాతం తగ్గిందని పవన్ చెప్పారు. వెంటనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు పది గ్రేస్ మార్కులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.

అప్పుడే న్యాయం....
అప్పుడే వారికి ప్రభుత్వం న్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. విద్యార్థులకు సరైన విద్యను అందించకుండా ప్రభుత్వం ఆ తప్పును తల్లిదండ్రులపై నెట్టడం సరికాదన్నరు. అలాగే రీవాల్యుయేషన్ కూడా ఉచితంగా చేయాలన్నారు. రీ వాల్యూయేషన్ కు రూ.500 లు చెల్లించాలని ఫెయిల్ అయిన విద్యార్థులను బాధించడం సరికాదని, ఇది దోపిడీయేనని పవన్ వ్యాఖ్యానించారు. సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఎలాంటి ఫీజు తీసుకోకుండా పరీక్షలను ప్రభుత్వం నిర్వహించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.


Tags:    

Similar News