భువనేశ్వరిని పరామర్శించిన పవన్ కళ్యాణ్

స్కిల్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును పవన్

Update: 2023-09-14 10:09 GMT

స్కిల్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును పవన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లిన పవన్ కళ్యాణ్.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో కలిసి చంద్రబాబును కలుసుకున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని పవన్ పరామర్శించి ధైర్యం చెప్పారు.

చంద్రబాబును కలిసిన అనంతరం బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. జగన్ తో ఇక యుద్ధమేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా ఆరు నెలలు మాత్రమే మీకు సమయం ఉందని.. తప్పులు సరిదిద్దుకోవాలని అన్నారు. యుద్ధమే కావాలంటే చేసి చూపిస్తామని జగన్ ను హెచ్చరించారు. గత నాలుగున్నర ఏళ్ల జగన్ పాలన అరాచకంగా సాగిందని.. అరాచకంలోనే భాగంగా చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని పవన్ ప్రకటించారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని అన్నారు. చంద్రబాబుతో మీరు ఏం మాట్లాడారంటూ ఒక మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా.. మీ ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును అడిగానని చెప్పారు. మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉందని చెప్పానని అన్నారు. పాలసీల పరంగా గతంలో మీతో విభేదించానని, కానీ వ్యక్తిగతంగా మీమీద తనకు ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవని స్పష్టంగా చెప్పానని అన్నారు.


Tags:    

Similar News