Pawan kalyan : భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశం

అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరత ఇవ్వాలనిపొత్తులు పెట్టుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు

Update: 2023-10-23 13:00 GMT

అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరత ఇవ్వాలని, వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ముగిసిన తర్వాత 2014లోనూ తాము రాష్ట్రానికి అనుభజ్ఞుడైన నాయకుడు కావాలని టీడీపీకి మద్దతిచ్చామన్నారు. తాను వైసీపీకి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదని, వారి విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మద్యపాన నిషేధిస్తూ వచ్చిన వ్యక్తులు విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతుండటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇసుక దోపిడీలతో పాటు ప్రత్యర్థులకు భయభ్రాంతులకు గురి చేయడం వంటి వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

చారిత్రాత్మకమైన సమావేశం...
ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ మ కూడా రద్దు చేయలేదన్నారు. రాజమండ్రి జైలులో 73 ఏళ్ల ఒక సీనియర్ నేతను నిర్భంధించడం బాధాకరమని పవన్ అన్నారు. అకారణంగా అరెస్ట్ చేసిన వారికి మాత్రం బెయిల్ రావడం లేదన్నారు. హత్యలు చేసిన వారికి కూడా బెయిల్ వస్తుందని అన్నారు. వైసీపీ తెగులు ఈ రాష్ట్రానికి పట్టుకుందని, అది పోవాలంటే టీడీపీ, జనసేన కలసి పోరాడాలని నిర్ణయించామని తెలిపారు. చారిత్రాత్మకమైన కలయిక ఈరోజు జరిగిందన్నారు. రాజమండ్రిలోనే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి చంద్రబాబుకు మద్దతుగా, ఆయనకు ధైర్యం ఇచ్చేలా ఈ సమావేశం పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తామంతా కలసికట్టుగా ఉన్నామంటూ క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణపై...
టీడీపీ, జనసేన కలసి ఎలా పనిచేయాలి? ఉమ్మడి కార్యాచరణ ఎలా రూపొందించుకోవాలి? ఉమ్మడి మ్యానిఫేస్టో ఎలా ఉండాలి? అన్న దానిపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు. రెండు పార్టీల క్యాడర్ ఎలా కలసి పనిచేయాలన్న దానిపై చర్చించామన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఏపీ ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు భవిష్యత్ లో జరిగే ఎన్నికలకు ఎలా వెళ్లాలి? అన్న దానిపై చర్చించామని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 150 రోజులు కూడా లేవన్న పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మళ్లీ రాజమండ్రిలో ఇలాంటి సభ జరగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News