మాస్ వార్నింగ్ లు ఇస్తున్న పవన్ కళ్యాణ్

ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

Update: 2023-06-19 03:14 GMT

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి పై చాలా ఫిర్యాదులు వచ్చాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. క్రిమినల్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాలను ప్రభావితం చేస్తానంటే తాను ఒప్పుకోనని అన్నారు. రౌడీయిజం చేసే వాళ్లకు తానెప్పుడూ వ్యతిరేకినని.. తనను పాలించేవాళ్లు, సీఎంగానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయి ఉండాలన్నారు. అంబేద్కర్ గురించి, గాంధీ, భగత్ సింగ్ గురించి చదువుకో అంటారు. కానీ పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి. సీఎం క్రిమినల్స్ కు అండగా ఉంటే ఏం చేయాలని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడు అయినందుకు నా పొలిటికల్ జర్నీ ఆలస్యమైంది. 2009 నుంచే పాలిటిక్స్ లో ఉండి ఉంటే వైసీపీ అధికారంలోకి రాకుండే చేసేవాడ్ని అన్నారు పవన్. ఆవేశంగా కాదు ఆలోచించి మాట్లాడుతున్నాను. నా మాటలకు బాధ్యత తీసుకుంటానన్నారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద 50 వరకు గూండాలు ఉన్నారు. మీ అందరూ పద్ధతి మార్చుకోవాలి. నాకు అవకాశం, అధికారం వచ్చిన తరువాత ఈ గూండాలని ప్రతి ఒక్కరిని వీధి విధి తన్ని తన్ని తీసుకెళ్తానన్నారు. ద్వారంపూడి నువ్వు ఆడబిడ్డల జోలికి వచ్చినా, మీ గూండాలు ఆడవాళ్లను బెదిరించినా.. మీ తాతను టీటీ నాయక్ తీసుకెళ్లినట్లే, ఎమ్మెల్యే ద్వారంపూడిని బేడీలు వేసి తీసుకెళ్తామన్నారు. మీ తాతకు టీటీ నాయక్ చేసినట్లు.. నీకు భీమ్లానాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తానంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిని హెచ్చరించారు. వైసీపీ నేతలపై, సీఎంపై కోపం లేదు. కానీ వాళ్లు చేసే క్రిమినల్ చర్యలతో వాళ్లు రాష్ట్రానికి సరైన వ్యక్తులు కాదని ఫిక్సయినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. గోదావరి జిల్లాలు బలం, నేను ఉన్న సామాజిక వర్గం ఉందని కొందరు నేతలు చెబితే తనకు అందరూ సమానమేనని చెప్పానన్నారు.


Tags:    

Similar News