ఏప్రిల్ లో రోడ్డు మీదకు వారాహి

జనసేన పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారు.

Update: 2023-02-08 06:43 GMT

మరో రెండు నెలల్లో వారాహి వాహనం ఆంధ్రప్రదేశ్ రోడ్లపైకి రానుంది. జనసేన పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంతటా పర్యటించనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారాహి వాహనం ఇప్పటికే సిద్ధంగా ఉండటంతో ఆయన ప్రయాణం ఏప్రిల్ నుంచి జరుగుతుందని పార్టీలో సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు.

తెలంగాణలోనూ...
ఏప్రిల్ నాటికి పవన్ కల్యాణ్ సినిమాల షూటింగ్ పూర్తయ్యే అవకాశముండటంతో ఆయన బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఫిబ్రవరిలో పార్టీలో సభ్యత్వాలు జరుపుతారు. మార్చి నెలలో జనసేన ఆవిర్భావ సభ ఉంటుంది. ఏప్రిల్ నుంచి వారాహిలో పవన్ పర్యటిస్తారని చెబుతున్నారు. మ్యానిఫేస్టో, అభ్యర్థుల ఖరారుపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ వారాహితో పవన్ యాత్ర చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News