హైకోర్టుకు పెన్షనర్లు.. ఇంటివద్దనే పంపిణీ చేయాలంటూ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెన్షనర్లు పిటీషన్ వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెన్షనర్లు పిటీషన్ వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంటికి వచ్చి పింఛన్లు ఇవ్వకపోతే వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడతామని, గతంలో మాదిరిగానే ఇంటి వద్దకు వచ్చి పింఛనును ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని పెన్షనర్లు తన పిటీషన్ లో కోరారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలపై...
వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయడానికి వీలులేదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ ఈ పిటీషన్ దాఖలయింది. పింఛన్ ను కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛను ఇవ్వకుంటే తాము ఇబ్బందులు పడతామని పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.