భయం గుప్పిట్లో జమ్మలమడుగు
కడప జిల్లా జమ్మలమడుగులో ప్రజలు భయంగా గడుపుతున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగులో ప్రజలు భయంగా గడుపుతున్నారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు తమ ఎదుట ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. మైలవరం నుంచి పెన్నా నదికి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం లోగా మరో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు ముంపు బారిన పడతామోనని భయపడుతున్నారు.
హెచ్చరికలు జారీ...
పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గండికోట నుంచి మైలవరానికి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గండికోట రిజర్వాయర్ లో 26.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మైలవరంలో ఆరు టీఎంసీల నీరు ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో ఉన్నారు.