కీలకనిర్ణయం.. వారందరికి ఆరోగ్యశ్రీ

ఇకపై ఏపీలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురైతే సీఎంసీవో కార్డు ద్వారా నగదు రహిత చికిత్సను అందించనున్నారు

Update: 2022-11-29 07:22 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడే వారికి వైద్య సదుపాయం అందించేందుకు అనుకూల నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదానికి గురైతే వారికి కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల కారణంగా...
ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎనిమిదివేల మంది పైగా ఆంధ్రప్రదేశ్ లో మరణిస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు, కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జగన్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఏపీలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురైతే సీఎంసీవో కార్డును జారీ చేయడం ద్వారా నగదు రహిత చికిత్సను అందించనున్నారు.


Tags:    

Similar News