Andhra Pradesh : ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్ రెడీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ త్వరలోనే అందనుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అంతా సిద్ధమయింది.

Update: 2024-08-25 06:48 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ త్వరలోనే అందనుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అంతా సిద్ధమయింది. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన ఫైలును సిద్ధం చేసింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధానితో ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారని చెబుతున్నారు. విభజన హామీల అమలులో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వం తమకు స్థలం అప్పగించకపోవడంతో రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమయిందని రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కానీ తాము స్థలాన్ని అప్పగించామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

రైల్వే జోన్ ఏర్పాటుకు...
కానీ కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు కోసం విశాఖ జిల్లాలోని ముడసర్లోవ వద్ద 52 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమయింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలుచేపట్టింది. రైల్వే అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే క్లియర్ టటిల్ తో ఉన్న పూర్తి హక్కులు కలిగిన భూములను ఇవ్వాలని రైల్వే శాఖ కోరుతోంది. ఈ స్థలానికి రైల్వే శాఖ ఓకే చెబితే అతి త్వరలోనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పడుతుంది. విశాఖకు దగ్గరలోనే ముడసర్లోవ ఉండటంతో విశాఖ వాసులకు మరింత సౌకర్యంగా ఉండనుంది. మొత్తం మీద రెండు మూడు నెలల్లోనే విశాఖ రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిసింది.


Tags:    

Similar News