పెద్దపులి సంచారంతో భయం భయం

పెద్దపులి సంచారంతో ఏలూరు జిల్లాలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు

Update: 2024-02-19 08:09 GMT

tiger, forest department, panic, eluru district

పెద్దపులి సంచారంతో ఏలూరు జిల్లాలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏలూరు జిల్లా గుంజవరంలోని అటవీ ప్రాంతంలోని గ్రామాల వైపునకు పెద్దపులి వస్తుండటంతో ప్రజలు అటవీ శాఖ అధికారలులకు సమాచారాన్ని ఇచ్చారు. ఒక పులంలో పెద్దపులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

పాలముద్రలు గుర్తింపు...
దీంతో పులి పాదముద్రలను గుర్తించిన ప్రాంతంలో అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. గుంజవరంలోని అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచారంతో ప్రజలు రాత్రి వేళ బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన పోలవరం, కన్నాపురం వంటి అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.


Tags:    

Similar News