దమ్ముంటే భయం లేకుండా ఆ విషయం చెప్పు పవన్: పేర్ని నాని

నవ్వుకుంటున్నారన్న కనీస ఆలోచన కూడా లేకుండా పచ్చి అబద్ధాలు పవన్ కళ్యాణ్

Update: 2023-08-14 14:52 GMT

వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కు నోటికొచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడి, ప్రజలను రెచ్చగొట్టడం చేస్తున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ మీద బురద వేయటం, చంద్రబాబుకు మేలు జరగాలని చూడటం పవన్ కళ్యాణ్ కు బాగా అలవాటైపోయిందని.. రాజకీయాల్లో ఇంతకన్నా తప్పుడు తనం ఉంటుందా అని ప్రశ్నించారు. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జై తెలంగాణ నినాదం మొదలయ్యింది. 2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పార్టీ పెట్టి జై తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. స్వర్గీయ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితే.. దానికీ జగన్ కి ఏమిటి సంబంధం...? అని ప్రశ్నించారు జనం నవ్వుకుంటున్నారన్న కనీస ఆలోచన కూడా లేకుండా పచ్చి అబద్ధాలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారన్నారు.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కలిసే టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని.. వైఎస్ రాజశేఖరెడ్డి వల్లే విభజన జరిగినట్టు మాట్లాడటం విడ్డూరమన్నారు.

చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ కిరాయికి ఒప్పుకున్నాడని.. కూలీ తీసుకుంటున్నాడన్నారు పేర్ని నాని. కూలీకి తగ్గట్టుగా పనిచేయడమే పవన్ కు తెలుసు తప్ప వాస్తవాలు, విచక్షణతో అతనికి పని లేదన్నారు. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మీద ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం, అసత్యాలు మాట్లాడటం తప్ప, ఆయన మాటల్లో వాస్తవాలేమున్నాయ్ అని ప్రశ్నించారు పేర్ని నాని. సీఎం జగన్ మీద పవన్ కు విపరీతమైన ద్వేషం, కక్ష ఉందన్నారు. ఇకనైనా, విషం చిమ్మే కార్యక్రమాలు కట్టిపెట్టాలని కోరారు పేర్ని నాని.
చంద్రబాబు కోసమే పనిచేస్తానని దమ్ముంటే ధైర్యంగా చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ అని అన్నారు పేర్ని నాని. ఎన్నికల దాకా ముసుగు వేసుకుని.. అప్పుడు కలిసి పోటీ చేయడం.. ఎవరికి తెలియని విద్యలు ఇవన్నీ..? అని అన్నారు. మీ స్కీమ్ ఏంటంటే.. 30 చోట్ల చంద్రబాబు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను పెట్టడు. నీవేమో అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తావు. ఆ నియోజకవర్గాలకు వెళ్ళి, ప్రభుత్వంపైన, మాపైన విషం చిమ్ముతావన్నారు. పవన్ కళ్యాణ్ 25-30 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసన్నారు. పార్లమెంటుకు ఒక సీటు పోటీ చేసి, నీవు ముఖ్యమంత్రివి అవుతావా అని ప్రశ్నించారు. పెందుర్తిలో మహిళ హత్య జరిగితే.. ఆ హత్య చేసిన వ్యక్తి, పూర్వం వాలంటీర్ గా పనిచేస్తే.. వాలంటీర్ వ్యవస్థకు హత్యకు ఏమిటి సంబంధం..? అలా అంటే, జనసేన, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని హత్యలు, ఎన్ని గంజాయి కేసులు, ఎన్ని మానభంగం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వాటన్నింటికీ మీరే కారణమా.. ? అప్పుడెందుకు నువ్వు బాధ్యత తీసుకోలేదు..? అని ప్రశ్నించారు పేర్ని నాని. నిజాయితీ ఉంటే.. 2014 -19 మధ్య నువ్వు , చంద్రబాబు కలిసి చేసిన పాలనలో మీరు ఏం చేశారో.. మళ్ళీ అదే పరిపాలనను తెస్తాం అని చెప్పే దమ్ముందా..? మీకు దమ్ముంటే.. ఆ మాట చెప్పండి. ఆ మాట చెప్పి జనం దగ్గరకు వెళ్ళండని సవాల్ విసిరారు.


Tags:    

Similar News