Anakapalli: అనకాపల్లిలో అందరి ముందు కోడిని కొరికాడు.. పెటా రాకతో కేసు నమోదు
జంతు హింసకు పాల్పడితే తప్పకుండా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బహిరంగంగా కొందరు చేసే పనుల పట్ల చట్టం చూస్తూ ఉండిపోదు.
జంతు హింసకు పాల్పడితే తప్పకుండా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బహిరంగంగా కొందరు చేసే పనుల పట్ల చట్టం చూస్తూ ఉండిపోదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఓ వ్యక్తి నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. అక్కడే పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పెటా రంగంలోకి దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం-1960లోని సంబంధిత సెక్షన్ కింద డ్యాన్సర్‌తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.