మూడు రాజధానులపై విచారణ కొనసాగించాలన్న పిటీషనర్లు
ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాలను తిరిగి ప్రవేశ పెడతామని చెప్పడంతో విచారణను కొనసాగించాలని పిటీషనర్లు కోరారు.
ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాలను తిరిగి ప్రవేశ పెడతామని చెప్పడంతో విచారణను కొనసాగించాలని పిటీషనర్లు కోరారు. ఈరోజు ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే తిరిగి ప్రభుత్వం చట్టాలను తెస్తామని చెప్పడంతో విచారణ కొనసాగించాలని పిటీషనర్లు హైకోర్టును అభ్యర్థించారు.
వాదనలు విన్న.....
అయితే ఏ అంశాలపై విచారణను కొనసాగించాలో అఫడవిట్ దాఖలు చేయాలని పిటీషనర్లను ధర్మాసనం ఆదేశించింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, పనులు నిలిపివేత, రైతులు అమరావతి కోసం ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయడం, రాజధాని నుంచి కార్యాలయాలను తరలింపు వంటి అంశాలపై త్రిసభ్య ధర్మాసనం వాదనలను వినింది. తిరిగి ఈ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.