Supreme Court : సుప్రీంకోర్టుకు పిన్నెల్లి బాధితుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు ప్రీంకోర్టును ఆశ్రయించారు. న్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని సుప్రీం కోర్టులో శేషగిరిరావు పిటిషన్ వేశఆరు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దుచేయాలని పిటిషన్ వేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని బాధితుడు పిటీషన్ లో పేర్కొన్నాడు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని శేషగిరిరావు తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ ను శేషగిరిరావు దాఖలు చేశారు.
ఈవీఎంను ధ్వంసం...
ఈవీఎంను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని నంబూరి శేషగిరిరావు పిటీషన్ లో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని, తీవ్ర ఘటనలైనా బెయిల్ మంజూరు ఆందోళన కలిగిస్తోందని శేషగిరిరావు సుప్రీంకోర్టుకు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, పిన్నెల్లి లేకున్నా.. ఆయన ఏజెంట్ కౌంటింగ్ పరిశీలించే అవకాశం ఉందని ఆయన పిటీషన్ లో కోరారు.