పోలవరానికి భారీ వరద.. ఆగిన పనులు

గతంలో ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.

Update: 2022-07-11 02:56 GMT

గతంలో ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. పోలవరం స్పిల్ వే గేట్ వద్ద 29.4 మీటర్ల మేర నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈరోజు అర్థరాత్రికి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాలో అధికారులు ఉన్నారు.

ఆకస్మికంగా రావడంతో...
గతంలో జులైలో 30 నుంచి 50 వేల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చేదని అధికారులు చెప్పారు. ఈసారి పది లక్షలకు పైగా వరద నీరు వచ్చిందంటున్నారు. ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాలు మరో రెండు రోజులు కురియనుండటంతో వరద నీరు ఇక్కడ మరింత పెరిగే అవకాశముంది. కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటి మట్టం 19.3 మీటర్లుగా ఉంది. గంటకు 25 సెంటీమీటర్ల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుందని, దిగువ కాఫర్ డ్యాం, గ్యాప్ 2 పనులు పూర్తిగా నిలిచపోనున్నాయని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News