టీడీపీ కమిటీ పర్యటనకు అనుమతి
తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు;
తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మింగి మండలం లోదొడ్డిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కిడారి శ్రావణ్ కుమార్, గుమ్మడి సంధ్యారాణి, గిడ్డి ఈశ్వరి తో పాటు మరికొందరు నేతలు ఈ కమిటీలో ఉన్నారు.
జీలుగు కల్లు తాగి...
వీరు గిరిజనుల మరణానికి కారణాలను తెలుసుకునేందుకు లోదొడ్డికి వెళ్లాలని నిన్న ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. ఈరోజు మాత్రం వారిని అనుమతించారు. అయితే అక్కడ కల్లులో ఏదో కలపడం వల్లనే గిరిజనులు మృతి చెందారని పోలీసులు ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. పాత కక్షలతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్లును పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.