Pinnelli : పిన్నెల్లి సోదరుడి కోసం వేట

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు

Update: 2024-07-02 07:17 GMT

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఎన్నికల రోజు జరిగిన ఘటనలపై నమోదయిన కేసులతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్ట్ చేసి ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలులో ఉన్నారు.

కేసులు నమోదు కావడంతో...
అయితే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News