కోనసీమలో విపక్ష నేతల అరెస్ట్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలియజేయాలని జనసేన పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు జనసేన నేతలను ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు.
పది వేలు ఇవ్వాలని...
రాజమండ్రితో పాటు కోనసీమ జిల్లా నేతలను కూడా హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ తో పాటు అనేక మంది కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ లు చేశారు. వరద బాధితులకు పది వేల రూపాయల పరిహారం చెల్లించాలని జనసేన డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ కు ఈ మేరకు తాము వినతి పత్రం అందజేస్తామని జనసేన నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.