కాకాణి నేడు హాజరవుతారా? లేదా?
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు;

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు. మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. ఇటీవల నోటీసులు ఇచ్చినా ఆయన నెల్లూరు లో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు.
మరోసారి నోటీసులు...
అయితే హైదరాబాద్ లో ఉన్నారని తెలిసి ఒక బృందం హైదరాబాద్ వు వచ్చి కాకాణి గోవర్థన్ రెడ్డి ఇంటికి వెళ్లింది. అక్కడ కూడా లేకపోడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి వచ్చారు. మైనింగ్ కేసులో ఆయనపై కేసు నమోదయిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలలోపు విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో కాకాణి గోవర్థన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నేడు విచారణ జరగనుంది.