బెజవాడలో వైసీపీ నేతల అరెస్ట్

రైతు సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న దేవినేని అవినాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2024-12-13 06:03 GMT

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనను ఆపడంపై అవినాష్ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దేవినేని అవినాష్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు సమస్యలను...
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నాతో పాటు కలెక్టర్ కు వినతి పత్రాన్నిసమర్పించేందుకు దేవినేని అవినాష్ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. రైతులకు అండగా నిలవడం తప్పా అంటూ పోలీసులను అవినాష్ నిలదీశాడు.అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు.


Tags:    

Similar News