సోము వీర్రాజుపై కేసు నమోదు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు;

Update: 2022-06-08 14:09 GMT

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించినందుకు సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

దురుసుగా ప్రవర్తించినందుకు....
ఈరోజు అమలాపురానికి వెళ్లేందుకు సోము వీర్రాజు ప్రయత్నించగా అక్కడ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు వాహనాన్ని నిలిపేశారు. ఏ రాజకీయ నేతను అమలాపురంలోకి ఎంటర్ కానివ్వడం లేదు. కానీ సోము వీర్రాజు ఎస్ఐ తో దురుసుగా ప్రవర్తించారు. ఎస్ఐను నెట్టివేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News