మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై మరో ఫిర్యాదు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది;

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. నిన్న పోక్సో కేసు విషయంలో బాధితురాలి పేరును బహిరంగంగా ప్రకటించినందుకు ఆయనపై గత ఏడాది వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనంతపురంలోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. మార్చి 5వ తేదీన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు.
నిన్న చేసిన వ్యాఖ్యలు...
అయితే నిన్న పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చిన సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వ్యాఖ్యానించారు. మాధవ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ వ్యవహరించారని ఫిర్యాదు చేశారు.