Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేటు ఊడిపోయింది.. ప్రమాదకరమైన పరిస్థితులో బ్యారేజీ

ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తతుంది. దీంతో ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడును రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది.;

Update: 2024-09-03 05:43 GMT
flood water, gates,  prakasam barrage, kannayya naidu
  • whatsapp icon

ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తతుంది. డెబ్బయి గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్కుల నీరు బయటకు వదులు తున్నారు. ప్రస్తుతం వరద నీరు తగ్గుముఖం పట్టింది. తొమ్మిది లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీలో ప్రమాదకరమైన పరిస్థితులు నిన్నటి వరకూ నెలకొన్నాయి. ప్రకాశం బ్యారేజీ పై ఉన్న రైలు పట్టాలకు మూడు అడుగుల దూరంలో వరద నీరు ప్రవహిస్తుంది. అక్కడ పడవ అడ్డం పడటంతో 69వ గేటు విరిగిపోయింది. దీంతో మిగిలిన గేట్లు కూడా విరిగిపోతాయమోనన్న ఆందోళన ఇంజినీరింగ్ నిపుణుల్లో వ్యక్తమవుతుంది.

మూడున్నర లక్షల మంది...
వరద నీరు ప్రవాహంతో దాదాపు మూడున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సర్వంకోల్పోయారు. విజయవాడ సగం మునిగిపోయింది. గతంలో చుక్క నీరు రాని ప్రాంతం కూడా ఈసారి వరద నీరు రావడంతో ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. దీంతో మరింత ప్రమాదరకమైన పరిస్థితి నెలకొని ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి గేట్ల మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ ఇంజినీరింగ్ నిపుణుడు కన్యయ్య వైపు చూస్తున్నారు. ఆయన ఒక్కరే దీనికి పరిష్కారం చూపగలరు. గేట్ల తయారీలో నిపుణుడిగా పేరు పొందిన కన్నయ్యను పిలిపించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ప్రకాశం బ్యారేజీ మరింత ప్రమాదంలో పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
రికార్డు స్థాయిలో....
ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. దాదాపు 125 ఏళ్ల తర్వాత ఇంత స్థాయిలో వరద నీరు వచ్చిందని చెబుతున్నారు. పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 2009 నెల అక్టోబరు నెలలో 10.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చింది. అయినా అప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. అంతకు ముందు 1903లో అక్టోబరు బ్యారేజీకి 10.60 లక్షల వరద నీరు చేరిందని లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇంత పెద్ద స్థాయిలో వరద ఎప్పుడూ రాలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బ్యారేజీ బయటపడాలంటే భారీ వర్షాలు నమోదు కావడంతో తగ్గడంతో పాటు వరద నీటి రాక ఆగిపోవడమే.
గేట్లను అమర్చడంలో...
ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్యకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పెర్ట్‌గా పేరుంది. ఇటీవల తుంగభద్ర ప్రాజెక్టుకు విరిగిపోయిన గేట్లను కూడా ఆయన విజయవంతంగా అమర్చగలిగారు. దీంతో కన్నయ్య నాయుడు పేరు పేరు మారుమోగిపోయింది. డ్యామ్ లో నీరు ఉన్నా గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ను పెటి  నీటి వృధాను అరికట్టగలిగారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నయ్య నాయుడును రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల పరిశీలనకు సలహాదారుగా నియమించుకుంది. ఇప్పుడు కన్నయ్య నాయుడు వల్లనే ప్రకాశం బ్యారేజీ వద్ద ఊడిపోయిన గేటును అమర్చడానికి ఆయన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారుగా నియమించడంతో ఆయన రాక కోసం ఇంజినీరింగ్ అధికారులు ఎదురు చూపులు చూస్తున్నారు. కన్నయ్యా... నీవే దిక్కయ్యా అని అంటున్నారు.
కన్నయ్యనాయుడు ఏమన్నారంటే?
మరోవైపు బోట్లు ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజీకి నష్టం లేదని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. గేట్లు, గోడలు అన్నీ పటిష్టంగానే ఉన్నాయన్న కన్నయ్య నాయుడు కేవలం కౌంటర్ వెయిట్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. దెబ్బతిన్న వాటిని తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్యారేజీ గేట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోట్లు తొలగించవచ్చని పేర్కొన్నారు . నీటిమట్టం 8 లక్షల క్యూసెక్కులకు చేరిన తర్వాత పనులు ప్రారంభిస్తామని కన్నయ్య నాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్స్ ని వర్క్ షాపులో తయారు చేసి ఇక్కడకు తెచ్చి అమర్చుతామని చెప్పారు. కొత్త కౌంటర్ వెయిట్స్ ని అమర్చడానికి 15 రోజులు సమయం అవసరం అవుతుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News