ఉద్యోగ సంఘాల్లో చిచ్చు... ఆందోళనకే మొగ్గు

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ ఉద్యమం చల్లారలేదు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనను కొనసాగించడానికే నిర్ణయించాయి

Update: 2022-02-06 14:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ ఉద్యమం చల్లారలేదు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనను కొనసాగించడానికే నిర్ణయించాయి. ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి. డిమాండ్లను నెరవేర్చుకోవడంలో విఫలమయ్యాయయని అంటున్నాయి. పీఆర్సీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ప్రలోభాలకు.....
అశుతోష్ మిశ్రా నివేదికను చూపించకుండానే చర్చలు ముగించడమేంటని ప్రశ్నించాయి. హెచ్ఆర్ఏ విషయంలోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని భావిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోను కూడా రద్దు చేయలేదని వారు తప్పు పడుతున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వ ప్రలోభాలకు లొంగిపోయారని విమర్శలు చేశారు. తాము ఆందోళనలు కొనసాగిస్తామని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. తమతో కలసి వచ్చే సంఘాలతో కలసి కార్యాచరణను రూపొందించుకుంటామని పేర్కొంది.


Tags:    

Similar News