కంటతడి పెట్టిస్తున్న టమాటా
టమాటా ధర పూర్తిగా పడిపోయింది. పత్తికొండ, మదనపల్లె మార్కెట్ లో కిలో రెండు రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు
టమాటా ధర పూర్తిగా పడిపోయింది. పత్తికొండ, మదనపల్లె మార్కెట్ లో కిలో రెండు రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు ముప్ఫయి వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, మార్కెట్ కు తీసుకు వద్దామంటే కనీసం రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. రోడ్డు మీదనే కొందరు రైతులు టమాటాను పారి పోసి వెళుతున్నారు.
లాభపడేది వారే....
ప్రభుత్వం తమను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరో వైపు వినియోగదారులకు మాత్రం కిలో ఇరవై రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. రైతులు, వినియోగదారులు నష్టపోతుండగా దళారులు మాత్రం లాభపడుతున్నారు. ఈ ఏడాది సీడ్ సరిగా లేకపోవడం, పంట దిగుబడి ఎక్కువగా ఉండటం వల్లనే ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.