కందుకూరు ఘటనలో మృతులకు మోదీ ఎక్స్గ్రేషియో
నిన్న కందుకూరులో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు.;

pm modi arrives in vizag
నిన్న కందుకూరులో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియోను ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి యాభై వేలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతిని వ్యక్తం చేశారు.
దురదృష్టకరం....
ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మృతదేహాలకు ఈరోజు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.