కోవింద్ వీడ్కోలు సభకు జగన్ దూరం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు అందరికీ ఆహ్వానం ప్రధాని కార్యాలయం పంపింది.

Update: 2022-07-23 03:33 GMT

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు అందరికీ ఆహ్వానం ప్రధాని కార్యాలయం పంపింది. అయితే బీజేపీ ముఖ్యమంత్రలు మినహా ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపలేదు అదే సమయంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందినా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు ఈ వీడ్కోలు సభకు హాజరు కాలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ కు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అందింది.

బాబుకు అందని ఆహ్వానం.....
కానీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఆయన అడగకపోయినా ముందుకు వచ్చి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపారు. ద్రౌపది ముర్ముకు 100 శాతం మద్దతు తెలిపిన రాష‌్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినా ప్రతిపక్ష నేతకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఈ విందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఇందులో పాల్గొన్నారు. విపక్ష నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్, అథీర్ రంజన్ చౌధురి కూడా ఈ విందుకు హాజరయ్యారు.


Tags:    

Similar News