ఆందోళనకు రెండేళ్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఏప్రిల్ ఒకటో తేదీకి రెండేళ్లు చేరుకున్నాయి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఏప్రిల్ ఒకటో తేదీకి రెండేళ్లు చేరుకున్నాయి. రెండేళ్ల నుంచి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ చెబుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాల నిర్ణయించాయి.
ఏప్రిల్ 1న....
ఇందులో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన మానవహారం కార్యక్రమం పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ కార్మిక వర్గం, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు ఏప్రిల్ ఒకటినాటికి రెండేళ్లు పూర్తవుతున్నందున ఏప్రిల్ 1వ తేదీన ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు.