ఇటు వైపు ఆ రైళ్లు బంద్... 120 రైళ్లకు జవాద్ సెగ
జవాద్ తుపాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైల్వే శాఖ కూడా అప్రమత్తమయింది.;
జవాద్ తుపాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైల్వే శాఖ కూడా అప్రమత్తమయింది. ప్రధానంగా దక్షిణమధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 120 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. తుపాను కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతినడం, బలమైన ఈదురుగాలుల సమయంలో ప్రయాణం కష్టమని భావించి 120 రైళ్లను రద్దు చేసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. జవాద్ తుపాను ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అన్ని రైళ్లను...
ఈ నెల 2 వతేదీ నుంచే ఈస్ట్ కోస్ట్ రైల్వే చాలా రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 5వ తేదీ వరకూ 120 రైళ్లు నడవవని, ప్రయాణికులు సహకరించాలని ఈస్ట్ కోస్ట్, దక్షిణమధ్య రైల్వే కోరింది. రద్దయిన రైళ్లను ఎప్పుడు పునరుద్ధించేది త్వరలో తెలుపుతామని పేర్కొంది. తుపాను తీవ్రతను బట్టి రైళ్ల రాకపోకలపై నిర్ణయం ఉండనుంది.