ఏపీలో ఆ నాలుగు జిల్లాలకు వర్షసూచన !

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం సాయంత్రానికి..

Update: 2022-03-21 11:32 GMT

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ సాయంత్రానికి తుపానుగా మారనుండగా.. దానికి అసనిగా నామకరణం చేశారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమై.. చల్లటి గాలులు వీస్తున్నాయి.

ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


Tags:    

Similar News