తెలుగు రాష్ట్రాలలో ఆ ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాల

Update: 2023-07-06 02:11 GMT

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తన ద్రోణి తోడవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా భాగాల్లో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల పిడుగులు, ఈదురు గాలులతో వానలు కురుస్తాయని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంటలు నీటమునిగాయి. మరో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జూలై 6వ తేదీన చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. జూలై 7వ తేదీన ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అల్లూరి సితారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కావచ్చు. జూలై 8వ తేదీ శనివారం నాడు కర్నూలు, నంద్యాల, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో చాలా ఆలస్యంగా వర్షాలు ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో వారం రోజులుగా మంచి వర్షాలు లేకుండా పోయాయి. రుతుపవనాలు నెమ్మదించిన తర్వాత బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.


Tags:    

Similar News