ఏపీలో మొదలైన వర్షాలు.. ఎన్ని రోజులు ఉంటాయంటే?

ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్‌, అన్నమయ్యతో పాటూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా అన్నమయ్య

Update: 2023-06-22 03:11 GMT

ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. నైరుతి విస్తరించడంతో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. రాబోయే నాలుగు రోజలు కోస్తా జిల్లాల్లో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.

ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్‌, అన్నమయ్యతో పాటూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 120.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడులో 105, ఎన్టీఆర్‌ జిల్లా కంచకచర్ల మండలం మోగులూరులో 88, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదరలో 79 మి.మీ. వర్షం కురిసిందని వాతావరణ శాఖ చెప్పింది. గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ లోకి కూడా రుతు పవనాలు వచ్చేశాయి. జూన్ 21వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని తాకాయి. ఈ ప్రభావంతోనే బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో ఎండ తీవ్రత తగ్గింది. రుతు పవనాల రాకతో హైదరాబాద్ నగరంలో సాయంత్రం ఆరు గంటల నుంచి వర్షం పడటం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సైదాబాద్, దిల్ షుఖ్ నగర్, కాప్రా, మల్కాజిగిరి, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతంలో వర్షం పడింది.


Tags:    

Similar News